సన్‌రైజర్స్‌ జట్టుకు ఆంధ్రా క్రికెట్‌ సంఘం ఆఫర్‌

52பார்த்தது
సన్‌రైజర్స్‌ జట్టుకు ఆంధ్రా క్రికెట్‌ సంఘం ఆఫర్‌
సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకు ఆంధ్రా క్రికెట్‌ సంఘం బంపర్ ఆఫర్‌ ఇచ్చింది. విశాఖకు తరలివస్తే, పన్ను మినహాయింపులు, ఇతర సహకారం అందిస్తామని తెలిపింది. హెచ్‌సీఏతో సన్‌రైజర్స్‌ వివాదం నేపథ్యంలో ఏసీఏ ఆహ్వానం అందించినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను విశాఖలో నిర్వహించాలని ప్రతిపాదించామని ఏసీఏ గురువారం తెలిపింది. సన్‌రైజర్స్‌ జట్టు నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంది.

தொடர்புடைய செய்தி