తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు

24287பார்த்தது
తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం మంచిర్యాల, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

தொடர்புடைய செய்தி