మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిని వ్యక్తిని రిమాండు తరలించినట్లు బెజ్జూర్ ఎస్ఐ కందూరి రాజు సోమవారం తెలిపారు. బెజ్జూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక ఈనెల 7న మండలంలోని మేనత్త ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో వరుసకు మామ అయిన రవీందర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్ఐ దర్యాప్తు చేసి నిందితుడిని ఆదివారం రిమాండ్ కు తరలించారు.