కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామంలో పోలీసులు భారీగా మద్యం పట్టుకున్నారు. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం. బుధవారం కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల తనిఖీల్లో భాగంగా గూడెం గ్రామంలో తనిఖీలు చేశామన్నారు. గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ. 19 లక్షల విలువైన మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం పలువురిపై కేసు నమోదు చేశామన్నారు.