విష జ్వరంతో మహిళ మృతి చెందిన ఘటన శనివారం లోకేశ్వరం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని లోకేశ్వరం గ్రామానికి చెందిన సిరిపెల్లి గంగామణి 34 జ్వరంతో బాధపడుతూ లోకేశ్వరంలో డాక్టర్ ను సంప్రదించిన నయం కాకపోవడంతో నిర్మల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందినట్లు తెలిపారు.