జన్నారం మండల ప్రజల సౌకర్యార్థం వేములవాడకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గౌడ సంఘం జన్నారం మండల అధ్యక్షుడు భాస్కర్ ఆదివారం కోరారు. ఉట్నూర్ డిపో నుంచి జన్నారం, కలమడుగు, జగిత్యాల మీదుగా వేములవాడకు బస్సు వేయాలని పేర్కొన్నారు. వేములవాడకు నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇక్కడి రాజరాజేశ్వర స్వామి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.