ప్రాజెక్టు అధికారులు శనివారం ఉదయం కడెం ప్రాజెక్టు తాజా వివరాలు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 700. 50 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 1003 క్యూసెక్కుల వరద నీరు వస్తోందన్నారు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలకు 906క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.