'తల్లికి వందనం' పథకం అమలు ఎప్పటినుంచి అంటే?

78பார்த்தது
'తల్లికి వందనం' పథకం అమలు ఎప్పటినుంచి అంటే?
తల్లికి వందనం పథకం వచ్చే జనవరి నుంచి అమలు చేయాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులందరికీ ఈ పథకం వర్తించనుంది. ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇందుకు రూ.12 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. రూ.20 వేల లబ్ధి చేకూర్చే 'అన్నదాత సుఖీభవ'ను మార్చి/ఏప్రిల్ లో అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி