బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలలో ఈ నిధులతో అభివృద్ధి చేసుకుంటామన్నారు. ఈ నిధుల విడుదలకు సహకరించిన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో నియోజకవర్గనికి ఆర్అండ్ బి, పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ. 100 కోట్ల నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.