ఆర్టీసీ బస్టాండును సందర్శించిన ఎమ్మెల్యే

56பார்த்தது
ఆర్టీసీ బస్టాండును సందర్శించిన ఎమ్మెల్యే
గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ను ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణను పరిశీలించి అక్కడ నెలకొన్న సమస్యలపై ఆర్టీసీ డిఎం కల్పనతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం బస్సులో ఎక్కి ప్రయాణికులతో పాటు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న చిరు వ్యాపారులను పలకరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி