ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామంలోని పురాతనమైన శ్రీమల్లికార్జున ఆలయంలో ఉదయం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. భక్తులు కోనేటిలో స్నానం ఆచరించి క్యూలైన్ లో ఆ శివుడి దర్శనం కోసం బారులు తీరారు. దీంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.