వరి పంటలో ఉల్లికోడు, ఆకు చుట్టు పురుగు ఉధృతి అధికంగా ఉందని రైతులు జాగ్రత్త తీసుకోవాలని ఏఈఓ రామచందర్ సూచించారు. నెన్నెల మండలంలోని కర్జి, దమ్మిరెడ్డి పేట గ్రామాల్లోని వరి పంట పొలాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. పిచికారి చేయాల్సిన నివారణ మందు వివరాలను రైతులకు సమగ్రంగా వివరించారు.