ఆదిలాబాద్ లోని రాములు కాంప్లెక్స్ వద్ద దుకాణంలో గత నెల 16న షట్టర్ పగలగొట్టి రాగి తీగలు చోరీ చేసిన కేసులో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వన్ టౌన్ సిఐ సత్యనారాయణ తెలిపారు. మహారాష్ట్ర వరోరాకు చెందిన దశరథ్, అర్జున్ బాపూరావు స్కార్పియో కారులో వచ్చే చోరీ చేసినట్లు తెలిపారు. రూ. 95 వేల విలువ గల రాగి తీగలను ఆదిలాబాదులో విక్రయించడానికి అదే కారులో రాగా అదుపులోకి తీసుకున్నామని అన్నారు.