వాస్తుపరంగా ఇంటిని నిర్మించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వాస్తుపరమైన ఇబ్బందులే ముందు గుర్తొస్తాయి. అందుకే వాస్తుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిని నిర్మించే ముందు ముఖ ద్వారానికి ఎదురుగా ఎలాంటి గోడలు ఉండకూడదు. ఈశాన్య భాగంలో పునాది తవ్వి నైరుతి దిక్కున చదును చేసి నిర్మాణం ప్రారంభించాలి. మన ఇంటికి ఎదురుగా మరో ఇంటి పైకప్పు ఉండకపోవడం ఉత్తమం.