గుజరాత్లోని వల్సాద్ లో తన 5 ఏళ్ల కుమారుడి బర్త్ డే పార్టీ నిర్వహిస్తుండగా యామిని బెన్ అనే మహిళ గుండెపోటుతో మరణించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఈ వీడియోలో మహిళ తన చేతిలో ఉన్న బిడ్డను మరో వ్యక్తికి అప్పగించి, అకస్మాత్తుగా కుప్పకూలింది. బాధితురాలిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.