విజయవాడ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు ఘోర ప్రమాదం తప్పింది. మధురానగర్ లోని రైల్వే ట్రాక్‌పై నుంచి సీఎం బుడమేరు వరద ఉద్ధృతిని పరిశీలిస్తుండగా అదే సమయంలో ఎదురుగా ట్రైన్ వచ్చింది. ఈ మేరకు రైలు రావడాన్ని గమనించిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై రెయిలింగ్ కు రైలు పట్టాలకు మధ్య ఉన్న చిన్నపాటి స్థలంలో చంద్రబాబును నిలబెట్టారు. ఆయనకు సుమారు 3 అడుగుల దూరం నుంచి రైలు వెళ్లడం ఈ వీడియోలో చూడవచ్చు.