అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పెంపుడు కుక్క తప్పిపోవడంతో ఢిల్లీకి చెందిన దీపయాన్ ఘోష్, కస్తూరి పాత్రా దంపతులు అల్లాడిపోయారు. దీంతో తమ కుక్క ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల బహుమతిని ఇస్తామని వెల్లడించారు. ఈ విషయాన్ని ప్లకార్డులపై రాసి చూపిస్తూ.. దిగిన ఫొటోలను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవలే దీపయాన్ ఘోష్ దంపతులు ఆగ్రా టూర్కు వెళ్లగా.. రెండు పెంపుడు కుక్కలను వెంట తీసుకెళ్లారు. ఆ సమయంలో ఓ కుక్క తప్పిపోయింది.