ఏపీలో హృద‌య విదార‌క ఘ‌ట‌న‌

84பார்த்தது
ఏపీలో హృద‌య విదార‌క ఘ‌ట‌న‌
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు రహదారిపై రక్తపు మడుగులో పడి ఉన్నాడు. కిలోమీటరు దూరంలో ఆస్పత్రి. పక్కనే ఉన్న అతని తల్లి తన బిడ్డను కాపాడుకునేందుకు కన్నీటితో అందరినీ ప్రాధేయపడుతోంది. 'అయ్యా.. కాస్త సాయం చేయండి. నా బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లాలి' అంటూ కన్నీటితో వేడుకుంది. అయినా ఏ ఒక్కరూ కనికరం చూపించలేదు. చివరకు 108 వచ్చే సరికే అమ్మ కళ్ల ముందే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన విజయనగరంలో జరిగింది.

தொடர்புடைய செய்தி