డీజిల్ ట్యాంక్ లో మంటలు చెలరేగి కడపలో రోడ్డుపై వెళ్తున్న ఇసుక లారీ దగ్ధం

65பார்த்தது
కడప చెన్నై జాతీయ రహదారిపై ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంక్ లో మంటలు చెలరేగి కడపలో ఇసుక లారీ దగ్ధమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదం జరిగిన చోటుకు సమీపంలో గ్యాస్ గోడౌన్ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేసే లోపే లారీ పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు.

தொடர்புடைய செய்தி