TG: ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఉండాలని సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను.. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. 6వ తరగతి విద్యార్థులకు గణిత శాస్త్రాన్ని బోధించారు. పిల్లలతో మమేకమై వారిని పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సిలబస్ గురించిన ప్రశ్నలు వేస్తూ జవాబులు రాబట్టారు.