శనగ, మైసూర్ పప్పులను కేంద్ర ప్రభుత్వం 'భారత్ బ్రాండ్'లో చేర్చింది. దీంతో శనగపప్పు కేజీ రూ.60, మైసూర్ పప్పు కేజీ రూ.89కే లభించనుంది. పెరుగుతోన్న ధరలను నియంత్రించే ప్రయత్నంలో భాగంగానే సబ్సిడీపై పప్పులను అందించాలని కేంద్రం నిర్ణయించింది. కాగా, మార్కెట్ లో శనగపప్పు రూ.110, మైసూర్ పప్పు రూ.115కు పైనే ఉంది. అమెజాన్, జియోమార్ట్‌తో పాటు బిగ్‌బాస్కెట్, బ్లింకిట్‌లో ఆర్డర్ పెట్టుకోవచ్చు.