ఏపీలో ప్రస్తుతం నోటిఫై చేసిన 3,396 మద్యం దుకాణాలకు అదనంగా 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ స్టోర్లకు ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. లైసెన్సు రుసుము ఏడాదికి రూ.కోటి. వీటికి సంబంధించిన విధివిధానాలు విడిగా ఖరారు చేస్తారు.