గుంటూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ఓ లారీలో పేపర్ బండిళ్ల లోడ్ పేరుతో అక్రమంగా తరలిస్తున్న 10 టన్నుల ఎర్రచందనాన్ని మంగళగిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి విశాఖకు వీటిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. లారీని సీజ్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.