సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు గవర్నర్, రాష్ట్రపతి సంతకం లేకుండా దేశంలోనే తొలిసారిగా తమిళనాట పది బిల్లులు చట్టరూపం దాల్చాయి. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం గెజిట్ జారీచేసింది. దీంతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నింటికీ ఇకపై ముఖ్యమంత్రే చాన్సలర్‌గా వ్యవహరిస్తారు. ఆ రాష్ట్ర గవర్నర్ RN రవి సుదీర్ఘకాలంగా 10 బిల్లులు పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.