Sep 30, 2024, 13:09 IST/
'PMMY' పథకం ద్వారా ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ. 20 లక్షల రుణం మీ సొంతం
Sep 30, 2024, 13:09 IST
మీరు కొత్తగా ఏదైనా సూక్ష్మ, చిన్న పరిశ్రమనో, వ్యాపారాన్నో ప్రారంభించాలని అనుకుంటే మీకు ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. ‘ప్రధానమంత్రి ముద్రా యోజన’ పథకం ద్వారా మీ వ్యాపారం కోసం 20 లక్షల రూపాయల వరకూ లోన్ తీసుకోవచ్చు. ఈ పథకం కింద ఎలాంటి పూచీకత్తు, గ్యారెంటీ లేకుండా బ్యాంకుల నుంచి 20 లక్షల రూపాయల వరకూ రుణం పొందవచ్చు. ఈ పథకం కింద ఇచ్చే రుణాలనే ‘ముద్రా రుణాలు’ అని పిలుస్తున్నారు.