Feb 26, 2025, 03:02 IST/మంథని
మంథని
పెద్దపల్లి: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలి
Feb 26, 2025, 03:02 IST
పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం, పరిశీలనాత్మక దృష్టిని పెంపొందించుకోవాలని జిల్లా సైన్స్ అధికారి రవినందన్ రావు అన్నారు. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో జాతీయ వైజ్ఞానిక దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ముందస్తు వైజ్ఞానిక ప్రదర్శనను డిఎస్ఓ మంగళవారం పారంభించారు. సృజనాత్మకమైన, వినూత్న, సమాజహిత ఆవిష్కరణలతో విద్యార్థులలో ఆలోచనలు రేకెత్తించేలా ప్రోత్సాహించాలని సూచించారు.