గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్-రాజ్‌కోట్ జాతీయ రహదారిపై ఆటోను డంపర్ లారీ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించారు. మృతుల్లో 8 నెలల చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే మృతదేహాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.