బద్వేలు మండలంలోని బయనపల్లె సమీపంలో ప్రధాన రహదారిపై ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో దొంగతనం జరిగినట్లు శుక్రవారం ఆలయ నిర్వాహకులు గుర్తించారు. ఆంజనేయ స్వామి మూలవిరాట్ కు అలంకరించిన వెండి పాదాలు, కళ్లు, కిరీటం, వెండి గధ తో పాటు అమ్మవారి బంగారు తాళిబొట్టు, సరుడు చోరీకి గురైనట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు. వాటి విలువ సుమారు రూ. 5 లక్షలు ఉంటుందన్నారు. ఆమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.