అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం వైసీపీ నేత శ్రీనివాసులు రెడ్డి తల్లిదండ్రులను దారుణంగా కొట్టారు. తల్లిని కొట్టడం, కాలుతో తన్నారు. తండ్రి చెంపపై కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. కన్న తల్లిదండ్రులను విచక్షణ రహితంగా కొట్టడం చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ను చూసి వైసీపీ కార్యకర్తలు నేర్చుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు.