ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పదవి బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా ఉండి నియోజకవర్గంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు శుక్రవారం రాత్రి కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆరేడు నుండి భారీ ర్యాలీగా పాములపరులోని ఆంజనేయస్వామి విగ్రహం వరకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కూటమి నాయకులు, కార్యకర్తలు, పూల బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.