ఈ నెల 23వ తేదీ వరకు కాళ్ళ మండలంలోని కాళ్ళ, ఏలూరుపాడు, పెద అమిరం గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు తహశీల్దార్ సుందర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అలాగే పోలీసు యాక్ట్ 30 కూడా అమలులో ఉంటుందని డీఎస్పీ జయసూర్య వెల్లడించారన్నారు. కావున ప్రజలు గుంపుగా ఒకచోట ఉండరాదని 144 సెక్షన్ నిబంధనలు ఉల్లంఘించరాదని సూచించారు.