ప్రభుత్వం స్పందించకపోతే వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు

1153பார்த்தது
ప్రభుత్వం స్పందించకపోతే వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏరియా తాపీ వడ్రంగి సెంట్రింగ్ రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధం కార్యవర్గ సమావేశం సోమవారం సిపాయిపేటలోని ఆఫీస్ భవనం నందు ప్రెసిడెంట్ పడాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలిపివేసిన క్లెయిమ్స్ వెంటనే మంజూరు చేయాలని నూతన సభ్యత నమోదు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేయాలని సమావేశం నిర్ణయించింది, ఈ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమ సుందర్
పి లక్ష్మణరావు అంకం భాస్కర్ రావు మెండం జేమ్స్, కోడే సాయి బాలాజీ, బసవ సామ్యూల్, దుర్గ ప్రసాద్, మధు, దూల ఆనంద్ , రామిశెట్టి నాగు, రెడ్డి మురళీకృష్ణ , యూనియన్ ప్రధాన కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி