గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి సీఎం, డిప్యూటీ సిఎం ఆలోచన చేసి పల్లె పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర తెలిపారు. సోమవారం సితానగరం మండలలోని గెడ్డలుప్పి ఆర్అండ్ బి కూడలి నుండి కొత్తవలస రోడ్డు వరకు బిటిరోడ్డుకు పల్లె పండుగ కార్యక్రమంలో శంకుస్థాపన చేశారు.