ఈ నెల 22న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు ఐటీఐ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ జిల్లా ఇన్‌చార్జి వాడపల్లి కిషోర్ బుధవారం తెలిపారు. 10, ఇంటర్ , డిగ్రీ, ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. హీరో, మోహన్ స్పింటెక్స్, అపోలో ఫార్మసీ కంపెనీల ప్రతినిధులు వస్తారని, సుమారు 180 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు.