జంగారెడ్డిగూడెం పట్టణంలో త్రాగు నీరు, రహదారి సమస్యలకు చెక్ పెట్టేందుకు 4. 65 కోట్లతో అభివృద్ధి పనులకు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. ఈ మేరకు ఈనెల 29న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించనుంది. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ముందుగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు మున్సిపల్ కమిషనర్ కొమ్మనేని వెంకట రమణ ఆదివారం వివరించారు.