ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలోని స్థానిక బస్టాండ్ దగ్గర ఉన్న దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన బాణా సంచాను ఆదివారం పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా దుకాణంపై దాడి చేసి రూ. 15, 000 విలువ గల బాణసంచాను స్వాధీనం చేసుకొని దుకాణ యజమానిపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ కుటుంబరావు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. అనుమతులు లేకుండా అక్రమంగా బాణాసంచా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.