పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కార్యాలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రెవెన్యూ విభాగం, రికార్డు రూమ్‌తో పాటు కార్యాలయం లాన్‌లోకి వర్షపు నీరు చేరింది. దీంతో రెవెన్యూ, రికార్డ్ రూమ్‌లోని రికార్డులు ముఖ్యమైన ఫైల్స్ తడవకుండా ఉండడానికి సోమవారం మున్సిపల్ సిబ్బంది అవస్థలు పడ్డారు. రూముల్లోని నీరును బయటికి తోడుతున్నారు.