యలమంచిలి మండలం పోతిరెడ్డి పాలెం గ్రామంలో శుక్రవారం ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ నిపుణులు వర్మ మాట్లాడుతూ ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా రుచికరమైన కూరగాయలు, ఆరోగ్యవంతమైన తిండి గింజలను మనం పండించుకోవచ్చునని అన్నారు. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించకుండా పండించే పంటలు ఆరోగ్యాన్ని ఇస్తాయన్నారు.