ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా యలమంచిలికి చెందిన సీనియర్ టిడిపి నాయకులు ప్రగడ నాగేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. గత 30 ఏళ్లుగా ఎలమంచిలి నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. అయితే గత ఎన్నికల్లో కూటమి తరపున జనసేన అభ్యర్థి విజయానికి విశేష కృషి చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అవకాశాన్ని అందజేశారు.