ఆధారాలు లేని వార్తలు రాసి తర్వాత తలదించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సూచించారు. అచ్యుతాపురంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఆధారాలు లేకుండా కంపెనీల వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేస్తున్నట్లు లేనిపోని వార్తలు రాయడం మంచి పద్ధతి కాదన్నారు. ఆధారాలతో నిరూపిస్తే తాను ఏం చేయడానికైన సిద్ధమని స్పష్టం చేశారు.