ఎలమంచిలి: రాకపోకలకు అంతరాయం

77பார்த்தது
ఎలమంచిలి: రాకపోకలకు అంతరాయం
ఎలమంచిలి మండలం రామారాయుడుపాలెం వద్ద కల్వర్టు నిర్మించాలని పలువురు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ కల్వర్టు లేకపోవడం వల్ల ఏమాత్రం వర్షం పడినా వరదనీరు రహదారిపై ప్రవేశిస్తుంది. దీనివల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమస్యను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లినట్లు స్థానికులు సోమవారం తెలిపారు. ఆరు గ్రామాల ప్రజలు ఈ రహదారిపై నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.

தொடர்புடைய செய்தி