ఎంవిపి కాలనీలోని అపార్ట్మెంట్లో పనిచేస్తూ, మూడో అంతస్తు నుంచి జారిపడి దుర్మరణం పాలైన 90వ వార్డు బుచ్చిరాజుపాలెం ప్రాంతానికి చెందిన బి ధనుంజరురావు కుటుంబానికి విశాఖ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో పోరాడి, సాధించిన రూ. 10లక్షల పరిహారం చెక్కును సోమవారం సిఐటియు నాయకుడు వెంకటరావు అందజేశారు. భవన యజమానితో చర్చలు జరిపిన వారిలో సిఐటియు నాయకులు మల్లేషు, పొన్నాడ రాజేశ్వరరావు ఉన్నారు.