పదవీ విరమణ చేసిన ముగ్గురు పోలీస్ అధికారులకు విశాఖ నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఇతర పోలీస్ అధికారులతో కలిసి సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ వారి సేవలను కొనియాడారు. పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగ విరమణ శేష జీవితానికి నాంది అన్నారు. సుఖసంతోషాలతో గడపాలని సూచించారు.