మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జనవాణి భరోసా కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.