సమిష్టి స్వయం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన ఊరు మన ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ ని ఆపేద్దాం - పర్యావరణాన్ని కాపాడుదాం అను నినాదంతో ప్రజలలో అవగహన కల్పించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ప్లాస్టిక్ వాడకంపై జరిగే లోటుపాట్లను వివరించారు. ఈ అవగాహన ర్యాలీలో సంఘము ప్రెసిడెంట్ జి చిన్నం నాయుడు, వైస్ ప్రెసిడెంట్ డి హరి బాబు, గ్రామ పెద్దలు బి జగదీష్, రామ రావు , జి పార్థసారధి, విద్యార్థులు పాల్గొన్నారు.