నర్సీపట్నంలోని గబ్బడ ఇసుక యార్డులో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను పట్టుకున్న వైసీపీ నాయకులపై అన్యాయంగా పోలీస్ కేసులు నమోదు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ ఆరోపించారు. బుధవారం నర్సీపట్నం తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ ఘటన జరిగిన రెండు రోజులు తర్వాత టిడిపి నాయకులు ఉద్యోగుల చేత కేసులు నమోదు చేయించారని పేర్కొన్నారు. దీనిపై తాము పోరాటం చేస్తామని తెలిపారు.