నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని గొలుగొండ తహశీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం సీపీఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి రామునాయుడు మాట్లాడుతూ నిత్యావసర ధరలను తగ్గించడంతో పాటు పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు పెట్టడం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు గురుబాబు, నాయకులు పాల్గొన్నారు.