జీడీ పిక్కలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే రైతు భరోసా కేంధ్రాలు ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తు జిల్లా వ్యాప్తంగా దశల వారీగా అందోన చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న పేర్కొన్నారు. సోమవారం దేవరాపల్లిలో జీడీ రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపాట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలోని వివిధ మండలాల్లో జీడీ పంట ప్రధాన పంటగా ఉందన్నారు.