హైకోర్టు ఆదేశాల మేరకు చిల్డ్రన్స్ డే సందర్భంగా మాడుగుల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక న్యాయవాది, చోడవరం బార్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనాదు ప్రసాధారావు మాట్లాతు పిల్లలు శారీరక కథలికలతో కూడిన ఆటలు ఆడుకోవాలని, తల్లితండ్రులను, గురువులను గౌరవించాలని, సహనం, ఓర్పు అలవాటు చేసుకోవాలనీ చెప్పారు. ఈ సమావేశంలో న్యాయవాది మోహనపాత్రుడు, పాఠశాల హెచ్ఎం సిబ్బంది పాల్గొన్నారు.