విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం ముడి పదార్థాల కొనుగోలుకు నిధులు కొరత ఏర్పడడంతో ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పదవీ విరమణ చేసినప్పుడు సెటిల్‌మెంట్ చేయడానికి ఏర్పాటు చేసుకున్న నిధుల నుంచి రూ. 390 కోట్లు వాడేసుకుంది. ఆ ఫండ్‌లో మొత్తం రూ. 609 కోట్లు ఉండాలని, కానీ రూ. 219 కోట్లు మాత్రమే ఉన్నాయని కార్మిక సంఘ నాయకులు ఆలస్యంగా గుర్తించారు. యాజమాన్యమే వాడేసుకుందని తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.